Home ఆంధ్రప్రదేశ్ స్నేహలత కుటుంబాన్ని సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆదుకున్న కలెక్టర్ కు అభినందనలు

స్నేహలత కుటుంబాన్ని సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆదుకున్న కలెక్టర్ కు అభినందనలు

274
0

అనంతపురం : దళిత యువతి స్నేహలతను హత్య చేసిన దుర్మార్గులపై కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యటమే కాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్నేహలత తల్లిదండ్రులకు ఉద్యోగం, ఐదు ఎకరాలు పొలం,  ఐదు సెంట్లు ఇంటి స్థలం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం నష్టపరిహారం, ముఖ్యమంత్రి ప్రకటించిన ఆర్థిక సహాయంను కలెక్టర్ గంధం చంద్రుడు వెంటనే అందజేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో తక్షణమే స్పందించిన కలెక్టర్ గంధం చంద్రుడికి మంచి పుస్తకం ఇచ్చి కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నల్లప్ప, నగర అద్యక్ష, కార్యదర్శులు జీవరత్నం, వెంకటేష్ తదితరులు ఉన్నారు.