Home ఆంధ్రప్రదేశ్ సేవా కార్యక్రమాలు నిర్వహించాలి : కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి

సేవా కార్యక్రమాలు నిర్వహించాలి : కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి

262
0

అమరావతి : లాక్ డౌన్ కాలంలో ఏప్రిల్ 11న జ్యోతీబాపూలే జన్మదినం మొదలుకొని 14న డా|| బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు దేశ వ్యాపితంగా సామాజిక న్యాయం కోసం జాతీయ కాంపెయిన్ జరపాలని దళిత శోషన్ ముక్తి మంచ్ (డిఎస్యంయం) జాతీయ కమిటీ నిర్ణయించిందని కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తెలిపారు.

దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమంగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిఎస్యంయం, దాని అనుబంధ సంఘాల కార్యకర్తలంతా లాక్ డౌన్ లో వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14న డా.బిఆర్ అంబేద్కర్ కు ఎక్కడికక్కడే ఎలాంటి ఆర్భాటాలు చేయకుండా నివాళులర్పించాలని కోరారు. ఈ సందర్భంగా పేదలు నివసించే ప్రాంతాలలో పరిశుభ్రత, ఆహార పంపిణీ, కరోనాపై జాగృతం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని, భౌతిక దూరం పాటిస్తూనే సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. కేపీపిఎస్ తో సహా వివిధ అంబేడ్కర్, దళిత సంఘాలకు, కార్యకర్తలకు కెవీపియస్ విజ్ఞపి చేస్తుందని తెలిపారు.