Home ఆంధ్రప్రదేశ్ గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్‌గా కుర్రా అప్పారావు

గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్‌గా కుర్రా అప్పారావు

17
0

గుంటూరు (Gunturu) : పట్టణంలోని చల్లపల్లి హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో (సాంబశివరావు రోడ్ పక్కన) సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu), నారా లోకేష్ (Lokesh) ప్రోత్సాహంతో గుంటూరు మిర్చియార్డ్ (Mirchi Yard) చైర్మన్‌గా కుర్రా అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ (మిర్చియార్డ్) చైర్మన్, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు.

వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు (Vemuru MLA Nakka Anadababu) పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం, మిర్చి వ్యాపార అభివృద్ధి, పారదర్శక వ్యవస్థ నిర్వహణకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. మిర్చి రైతుల ప్రయోజనాలు కాపాడుతూ, మార్కెట్‌లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం, పారదర్శక లావాదేవీలు నిర్వహించడం, రైతులకు న్యాయమైన ధరలు అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన చైర్మన్ కుర్రా అప్పారావు మాట్లాడుతూ రైతులు, వ్యాపారులు, కార్మికుల సమన్వయంతో మిర్చియార్డ్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడు, కొల్లు రవీంద్ర, లిడ్‌క్యాప్‌ ఛైర్మన్‌ పిల్లి మాణిక్యరావు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎంఎల్‌ఎలు కార్యక్రమానికి కూటమి నాయకులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు, రైతులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.