Home బాపట్ల కొత్తపేట పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

కొత్తపేట పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

58
0

వేటపాలెం : కొత్తపేట పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. గ్రామంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. రిటర్నింగ్ ఆఫీసరు అక్టోబర్ 23న నోటీసు జారీ చేస్తారు. అదే రోజు వార్డు వారీగా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. అక్టోబర్ 23 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 26న నామినేషన్లను పరిశీలిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై అక్టోబర్ 27న చీరాల ఆర్‌డిఒకు అప్పీలు చేసుకోవచ్చు. అక్టోబర్ 28న అప్పీల్‌ పరిష్కారం చేస్తారు. అక్టోబర్ 29న అభ్యర్ధిత్వం ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్ధులను ప్రకటిస్తారని తెలిపారు. నవంబర్ 3న ఓటింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి లెక్కింపు ప్రారంభం అవుతుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాలు ప్రకటించిన రోజునే ఉపసర్పంచి ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో గ్రామంలోని రాజకీయ ప్లెక్సీలను అధికారులు, పంచాయితీ సిబ్బంది తొలగించారు.