టంగుటూరు : వైయస్సార్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ కొండేపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరుగుతున్న పాదయాత్రలో కలిసి సుమారు 20 నిమిషాలు మాట్లాడారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు ఆసక్తికర సంభాషణలు చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
జగన్ మోహన్ రెడ్డి, అశోక్ బాబుని చూడగానే అశోక్ కలవడం లేదు ఏంటి? అని అడిగినట్లు.. సార్ నేను సస్పెండ్ అయ్యాను కద అందుకనే కలవలేదు సార్ చెప్పినట్లు సస్పెన్షన్ ఏంటి అని జగన్ అడిగినట్లు, నన్ను బహిష్కరించారని పేపర్లో వచ్చింది, అందుకనే జిల్లా నేతల అనుమతి లేకుండా కలవకూడదని మిమ్మల్ని కలవలేదు అని తెలిపినట్లు తెలిసింది. అలాగే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నమై, ప్రతిరోజు, ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటున్నట్లు, అందుకనే మిమ్మల్ని కలవలేక పోయాననీ అశోక్ చెప్పాడని తెలిసింది. ఓకే అక్కడి విషయాలు అన్నీ నాకు తెలియట్లేదు అని జగన్ అన్నట్లు తెలిసింది.
పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ పని చేయలేదని, పార్టీకి ఇబ్బంది లేకుండా, ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నాని తెలిపినట్లు, పార్టీని అక్కడున్న కొంతమంది తెలుగుదేశం వాళ్ళతో సంబందాలు ఉన్న నాయకులు తెలుగుదేశం వాళ్ల చేతుల్లో పార్టీని పెడుతున్నట్లు తెలిపినట్లు తెలిసింది. నాలుగు రోజుల తర్వాత పాదయాత్ర అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చి కలవమని తెలిపినట్లు తెలిసింది. సర్వేలు వస్తాయని, సర్వేలు వచ్చిన తరువాత సీటు ఎవరికి ఇవ్వాలో తెలపనున్నట్లు ఆయనకు తెలిపినట్లు తెలిసింది. అశోక్ బాబు వెంట ఆ పార్టీ ఐటీ విభాగం మాజీ అధ్యక్షులు పమ్మి శేషిరెడ్డి వున్నారు.