Home ప్రకాశం జగనన్న విద్యా కానుక పేదలకు పెద్దవరం : వైసీపీ కొండపి ఇంచార్జ్ డాక్టర్ వెంకయ్య

జగనన్న విద్యా కానుక పేదలకు పెద్దవరం : వైసీపీ కొండపి ఇంచార్జ్ డాక్టర్ వెంకయ్య

476
0

సింగరాయకొండ (దమ్ము) : ముఖ్యమంత్రి జగన్మోహన్ విద్యకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని, ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వైఎస్ఆర్సిపి కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. మండలంలోని పాకల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ వెంకయ్య మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తే జగన్మోహనరెడ్డి విద్యకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఎక్కువ నిధులు కేటాయించి నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చారన్నారు.

పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ వైసిపి వైద్యవిభాగం అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, ఎఎంసి చైర్మన్ రాపూరి ప్రభావతి, సామంతుల రవికుమార్ రెడ్డి, తాండ్ర రామ్మూర్తి, కనుమళ్ల సొసైటీ అధ్యక్షులు మలినేని వెంకటేశ్వర్లు, షేక్ లియాఖత్, ఎం సత్యనారాయణ, ప్రకాష్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టంగుటూరు : జమ్ములపాలెం ప్రభుత్వ పాఠశాలలో జగనన్న విద్యాకానుక కిట్లను టంగుటూరు సొసైటీ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, వైసీపీ మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీవారిబాబు, ఎఎంసి వైస్ ఛైర్మన్ చింతపల్లి హరిబాబు పంపిణీ చేశారు.

కారుమంచి : జగనన్న విద్యాకానుక కిట్లను వైసీపీ నాయకులు సిరిపురపు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో వల్లూరమ్మ దేవస్థానం మాజీ ఛైర్మన్ సూరం రమణారెడ్డి, గ్రామ నాయకులు సుంకర బ్రహ్మానందరెడ్డి విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ గ్రామ నాయకులు కాపా శ్రీనివాసులరెడ్డి, సొసైటీ మాజీ ఛైర్మన్ ఘడియం శ్రీనివాసులురెడ్డి, విద్యాకమిటీ చైర్మన్ పూండ్ల అంకమ్మరావు, మాజీ సొసైటీ డైరెక్టర్ మన్నం వెంకటేశ్వర్లు, బత్తుల శ్రీనివాసులు, ముక్కు రవీంద్ర, ముక్కు శ్రీనివాసులు, బద్ధిపూడి రత్నం, కోటి, అశోక్ పాల్గొన్నారు.

జరుగుమల్లి : జనార్దనపురం ప్రభుత్వ పాఠశాలలో జగనన్న విద్యాకానుక కిట్లను వైసీపీ మండల నాయకులు ఎన్నార్ఐ శ్రీనివాసరావు, కొర్రపాటి వెంకటేశ్వర్లు అందజేశారు. కార్యక్రమంలో కంచర్ల ప్రసాద్, కొండలు, ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు, సురేంద్ర, శివకోటిరెడ్డి, కొమ్మలపాటి శ్రీను, పోటు వెంకట్, బెజవాడ రమేష్, కొండయ్య, బల్లికుర వెంకటేశ్వర్లు, రాజు, చెన్నయ్య, బడుగు మాల్యాద్రి, గోవిందయ్య, వాసు పాల్గొన్నారు.

మర్రిపూడి : కూచిపూడి జిల్లాపరిషత్ పాఠశాలలో జగనన్న విద్యాకానుక కిట్లను విద్యాకమిటీ చైర్మన్ ఈర్ల తిరుమలరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యాంసన్ అందజేశారు. కార్యక్రమంలో శ్రావణ్ కుమార్, సబితా కిరణ్, శ్రీలక్ష్మి, రమాదేవి, రాజ్యలక్ష్మి, అనూరాధ, సిఆర్పి కళ్యాణి పాల్గొన్నారు.