టంగుటూరు : కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్చార్జిగా వరికూటి అశోక్ బాబుకు తిరిగి ఇవ్వడానికి అధిష్టానం నుండి స్పష్టమైన సంకేతాలు అందినట్లు అశోక్ బాబు అభిమానులు చెప్పుకుంటున్నారు. అశోక్ అనుచరులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టంగుటూరు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి అభిమానులు వచ్చి అశోక్ బాబుకు అభినందనలు తెలుపుతున్నారు.
ఈనెల 27న అధికారికంగా ఆ పార్టీ శ్రేణులు ప్రకటించనున్నట్లు సోషల్ మీడియాలో, ఫేస్ బుక్, వాట్సప్ లలో ప్రచారం జరుగుతోంది. కొండపి నియోజకవర్గ ప్రజల్లో వచ్చిన రాజకీయ చైతన్యమే అశోక్ బాబుకి సీటు సాధిస్తుందని చెబుతున్నారు. రెండురోజుల నుండి అశోక్ బాబు వద్దకు వచ్చే నియోజకవర్గంలోని ఆయన అభిమానుల తాకిడిమాత్రం ఎక్కువయ్యింది. కొండపి నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందని అభిమానులు చెప్పుకుంటున్నారు.