Home ప్రకాశం పొగాకు సమాఖ్యకు వందకోట్లు కేటాయించాలి : ఆంద్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు

పొగాకు సమాఖ్యకు వందకోట్లు కేటాయించాలి : ఆంద్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు

322
0

– క్వింటాకు పదివేలకు తగ్గకుండా లోగ్రేడు కొనుగోలు చేయాలి.
కొండేపి (జూన్ 15) : మండల కేంద్రమైన కొండేపి పొగాకు వేలం కేంద్రం ఆవరణలో సోమవారం పొగాకు రైతులతో కలిసి రైతుసంఘం నాయకులు పొగాకు తగులబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పమిడి వెంకట్రావు మాట్లాడుతూ ప్రస్తుతం క్వింటాకు 2800కి తగ్గాయని, ఈ విధంగా కొనుగోలు చేస్తే ఒక్కొక్క బ్యారన్ కి 2నుండి 4లక్షల వరకు నష్టం వస్తుందన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తి దారుల సమైక్యకు రూ.100కోట్లు రివాల్వింగ్ ఫండ్ కింద కేటాయించి, లోగ్రేడు పొగాకు క్వింటాకు 10 వేలకు తగ్గకుండా పొగాకు వ్యాపారులు కొనుగోళ్ళు జరిపేలా పొగాకు బోర్డు అధికారులు ఆదేశించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. తదనంతరం పొగాకు వేలం కేంద్రం ఆవరణలో పొగాకును తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కెజి మస్తాన్, రైతు సంఘం నాయకులు ముప్పరాజు రాజు బ్రహ్మయ్య, గుమ్మళ్ల వెంకటేశ్వర్లు, కె వెంకట్రావు, పొగాకు రైతులు తిరుపతయ్య, అచ్చయ్య, వెంకటేశ్వర్లు, హనుమంతరావు, ముప్పరాజుపాలెం, అనకర్లపూడి, పెరిదేపి రైతులు పాల్గొన్నారు.