Home ప్రకాశం ఘనంగా జరిగిన కొండపి ఎమ్మెల్యే స్వామి పుట్టినరోజు వేడుకలు : ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు,...

ఘనంగా జరిగిన కొండపి ఎమ్మెల్యే స్వామి పుట్టినరోజు వేడుకలు : ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు, అచ్చెనాయుడు, లోకేష్ బాబు.

428
0

కొండపి (దమ్ము) : కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పుట్టినరోజు సందర్బంగా ఎమ్మెల్యే స్వామి కి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చరవాణి ద్వారా (ఫోన్) ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యే స్వామి జన్మదిన వేడుకలు కొండపి నియోజకవర్గం లోని కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, మర్రిపూడి, పొన్నలూరు మండలాలలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

ఎమ్మెల్యే స్వామి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రే తిరుమల వెళ్లారు.ఆదివారం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుని రాత్రి 7 గంటలకు టంగుటూరు మండలం టి.నాయుడుపాలెం స్వగృహానికి విచ్చేశారు. అనంతరం టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా అందరూ ఎమ్మెల్యే కి కేక్ తినిపించి,గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.