Home ప్రకాశం సంక్షేమ పథకాలలో పక్షపాతం చూపిస్తే అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పుదు : కొండపి ఎమ్మెల్యే...

సంక్షేమ పథకాలలో పక్షపాతం చూపిస్తే అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పుదు : కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి

411
0

ప్రకాశం : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందజేయాలని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కోరారు. కొండపి నియోజకవర్గంలో కిందిస్థాయి వైసిపి నాయకులు చెప్పిన విధంగా గ్రామ వాలంటర్లు, సెక్రటేరియట్ లోని సంక్షేమ అధికారులు నిర్లక్ష్య ధోరణితో అర్హులను సైతం అనర్హులుగా ప్రకటిస్తున్నారని జాయింట్ కలెక్టర్-3 బాపిరెడ్డిని కలిసి మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. పెన్షన్లు అన్నివర్గాల వారికి అందజేయాలని, పక్షపాతంతో ఒక వర్గం వారిని అనర్హులుగా ప్రకటించడం సరికాదని, పెన్షన్లు విషయంలో ఇదేవిధంగా జరుగుతుంటే గతంలో కలెక్టర్ దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కొండపి నియోజకవర్గంలో షుమారు 600మంది టీడీపీకి చెందిన వారిని అనర్హులుగా ప్రకటించారన్నారు. కొన్ని గ్రామాల్లో వాలెంటర్ల్లు మీరు నాయకులు దగ్గరికి వెళ్ళండి. ఆ నాయకుడు చెబితేనే అప్లోడ్ చేస్తామని చెబుతున్నారని వివరించారు. కొన్ని గ్రామాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లు మేము ఆన్లైన్ చేద్దాం అనుకున్నాం కానీ గ్రామంలోని వైసీపీ నాయకుడు టీడీపీ వారివి ఆన్లైన్ చేయొద్దని చెప్పి అర్జీలను చించివేయడం జరిగిందన్నారు. కొన్ని గ్రామాల్లో టీడీపీ వారు మా వైసీపీ కండువా కప్పుకుంటే మీకు లబ్ధిచేకూరుస్తామని వైసీపీ నాయకులు బాహాటంగానే మాట్లాడుతున్నారని అన్నారు. ఇటువంటి సంఘటనలన్నీ చూస్తూ ఉంటే అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించాలని చెబుతున్న ముఖ్యమంత్రి మాటలు కూడా గ్రామంలోని వైసీపీ నాయకులు పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ అందించాల్సిన అవసరం ఉందన్నారు.

రాజకీయాలనేవి ఎన్నికల ముందు చూడాలి తప్ప ఎన్నికల తర్వాత ప్రజలందరినీ సమభావంతో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైసీపీ నాయకులు ప్రజలను భయపెట్టో, ప్రలోభాలకు గురిచేసో, ఒత్తిడులు పెట్టి సంక్షేమ పథకాల విషయంలో పక్షపాతం చూయిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామ వాలంటీర్లు, అధికారులు ప్రభుత్వ ధనంతో పని చేస్తున్నారని, వారు ఒక రాజకీయ పార్టీకి చెంది ఉండవచ్చు కానీ వారు తీసుకునే జీతం ప్రజల సొమ్మని గమనించుకోవాలన్నారు. అర్హత ఉండి అనర్హులుగా లబ్ధిచేకూరని వారందరి పేర్లను జాయింట్ కలెక్టర్-3 బాపిరెడ్డికి ఇచ్చిన మెమోరాండంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఎంపీడీవోలతో మాట్లాడి గ్రామ వాలంటర్లు, వెల్పేర్ అధికారులపై విచారణ చేపట్టి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనకర్లపూడిలో అర్హత ఉన్న 21మంది టిడిపికి చెందిన వారని, వారికి పెన్షన్లు ఇవ్వలేదని దీనిపై సమగ్ర విచారణ జరిపి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు ముఖ్యమంత్రి చెబుతున్న విధంగా సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందించాలని అలాకాకుండా వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి పక్షపాతం చూయిస్తే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.