Home ప్రకాశం ఓటమి భయంతోనే చంద్రబాబు అరెస్టు

ఓటమి భయంతోనే చంద్రబాబు అరెస్టు

367
0

కొండేపి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకొనే టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమ అరెస్టు చేయించారని ఎమ్మెల్యే డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సింగరాయకొండలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.

దీక్షలో ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు చూపించారని అన్నారు. రాష్ట్రంలో నడుస్తున్న రాక్షస, అరాచక పాలనను ప్రజలకు వివరిస్తూ చంద్రబాబు, లోకేష్ చేపట్టిన యాత్రలకు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి అధికార వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఆ భయంతోనే ప్రజల దృష్టి మరల్చడంతోపాటు చంద్రబాబును కట్టడి చేసేందుకు అరెస్టు చేశారని అన్నారు. ఇలాంటి కేసులు నిర్బంధాలు తెలుగుదేశం పార్టీకి కొత్త ఏమీ కాదని అన్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధిస్తుందన్నారు. అధికార వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

కార్యక్రమంలో సిపిఎం నాయకులు రవి, సిపిఐ నాయకులు వీరారెడ్డి, జనసేన మండల నాయకులు రాజేష్, జైభీమ్ పార్టీ నాయకులు సంఘీభావంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ మండల అధ్యక్షులు వేల్పుల సింగయ్య, మండల ప్రధాన కార్యదర్శి చీమకుర్తి కృష్ణ, కూనపురెడ్డి సుబ్బారావు, మించల బ్రహ్మయ్య, గాలి హరిబాబు, సన్నిబోయిన శ్రీనివాసులు నాయుడు, అధికసంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.