కొండపి : కొండపి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో దామచర్ల కుటుంబం చల్లని చూపు ఎల్లప్పుడూ ఉండలాని కొండపి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణ చంద్రరావు జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం వారి నివాసంలో కలిసి ఎమ్మెల్యే స్వామి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ పెద్దాయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అన్నారు. కొండపి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు అభివృద్ధి ఫలాలు అందించడంలో దామచర్ల కుటుంబ పాత్ర మరువలేనిదని కొనియాడారు. రాబోయే కాలంలో కూడా దామచర్ల కుటుంబం కొండపి నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎఎంసి చైర్మన్ గొర్రెపాటి రామయ్య, నాయకులు మురళితో పాటు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.