కొండేపి (Kondepi) : రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, పురపాలక శాఖ మంత్రి, వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) సహకారంతో జాబ్ మేళా (Job Mela) ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఇటువంటి జాబ్ మేళాలతో మేలు జరుగుతుందని అన్నారు. కొండపి ప్రాంత ప్రజలకు మెరుగైన అవకాశాలు తీసుకురావడానికి ముందు రోజుల్లోనూ ప్రయత్నిస్తానని అన్నారు. ప్రజలకు ఏ చిన్న మేలు జరిగే కార్యక్రమమైన తీసుకురావడానికి తప్పనిసరిగా కృషి చేస్తానని అన్నారు. యువతలో ఉన్న నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. పూర్వం ఇన్ని అవకాశాలు ఉండేవి కాదని అన్నారు. ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు పెరుగుతుండటంతో అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. నైపుణ్యాన్ని బట్టి ఏ రంగంలో మీకు ఆసక్తి ఉంటే దానికి అనుగుణంగా ఉన్న అవకాశాలను వెతికి వారి వద్ద నైపుణ్యాన్ని రుజువు చేసుకుంటే తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని అన్నారు. ఈ జాబ్ మేళాలో వివిధ విభాగాలకు చెందిన 52కంపెనీల్లో ఉన్న ఉద్యోగాలు గురించి హాజరైన అభ్యర్ధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ ఇలా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కొండపిలో జాబ్ మేళా నిర్వహిస్తానని అన్నారు. ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.