కొండపి : స్థానిక ఎస్బిఐ సెంటర్ నందు కొండపి జడ్పీటీసీ అభ్యర్థిని భర్త, వైసీపీ యువ నాయకులు మారెడ్డి వెంకటాద్రి తన స్వంత నిధులతో 108 సిబ్బందికి నిత్యావసర సరుకులను మాదాసి వెంకయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ నాలుగు నెలలుగా జీతాలు లేక సతమతమవుతున్న పంచాయతీ సిబ్బందీని ఆదుకోన్న వెంకటాద్రిని ప్రత్యేకంగా అభినందించారు. నియోజకవర్గంలో కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాకుండా కృషి చేసిన 108మంది సిబ్బందితో పాటు వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది, జర్నలిస్టులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కొండపి నియోజకవర్గంలోని ప్రజలను అభినందించారని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.