కొండపి : కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్ పార్టీ సంస్థాగత పదవుల్లో ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు అనుచరులకు పదవులు దక్కాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు వైసీపీ మండల కన్వీనర్లుగా అశోక్ బాబు అనుచరులు నియమితులైనట్లు అధికారికంగా పార్టీ ప్రకటించింది. దీంతో అశోక్ బాబు వర్గంలో జోష్ కనిపించింది.
టంగుటూరు మండలం మల్లవరపు రాఘవరెడ్డి, కొండపి మండలం ఆరికట్ల కోటిలింగయ్య, మర్రిపూడి మండలం దద్దాల మల్లికార్జున, సింగరాయకొండ మండలం సామంతుల రవి కుమార్ రెడ్డి, జరుగుమల్లి మండలం బత్తిన మదన్ మనోహర్ రావు, పొన్నలూరు మండలం పల్లపోలు బాలకోటి రెడ్డి లను నియమించారు. ఈ సందర్భంగా తమను వైసీపీ మండల కన్వీనర్లుగా నియమించిన అశోక్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.