Home ప్రకాశం అట్టహాసంగా డోలా నామినేషన్

అట్టహాసంగా డోలా నామినేషన్

613
0

కొండెపి : టిడిపి అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వల్లూరమ్మ దేవాలయంలో స్వామి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీతో టంగుటూరు మీదుగా కొండేపి తహసిల్దార్ కార్యాలయంకు చేరుకున్నారు. ఎన్నికల ప్రత్యేక అధికారి నాయక్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయన వెంట ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి సిద్దా రాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్, టంగుటూరు మాజీ సర్పంచ్, ప్రముఖ పారిశ్రామికవేత్త బెల్లం జయంత్ బాబు, టిడిపి సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచందర్రావు, తెలుగు యువత జిల్లా నాయకులు దామచర్ల సత్య, టంగుటూరు ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, డోలా శ్రీధర్ ఆయన వెంట ఉన్నారు.

కార్యక్రమంలో కొండెపి ఎఎంసి ఛైర్మెన్ గొర్రెపాటి రామయ్య చౌదరి, ఒంగోలు డైరీ డైరెక్టర్ కంచర్ల ప్రసాద్, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి రామా గోపి, జడ్పీటీసీల సంఘము జిల్లా అధ్యక్షులు కంచర్ల శ్రీకాంత్, కొండెపి ఎంపీపీ రత్తమ్మ, జరుగుమల్లి జడ్పీటీసీ గాలి పద్మావతి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజా, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు రాంబట్ల నాయుడు, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు నాదెండ్ల సూర్యప్రకాశరావు, టంగుటూరు, జరుగుమల్లి, కొండెపి మండలాల టిడిపి అధ్యక్షులు కామని విజయకుమార్, టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, మక్కెన హరిబాబు, పోకూరి రవీంద్ర బాబు, నాయుడు, ఏల్పుల శింగయ్య, బీసీ సెల్ బత్తుల నారాయణస్వామి, జిల్లా ఎస్సి సెల్ బత్తుల బ్రహ్మానందం, టంగుటూరు మండల తెలుగు యువత అధ్యక్షు కాట్రగడ్డ అనీల్, ఈదర ప్రభాకర్, మొలకలపల్లి కోటేశ్వరరావు, పిడుగురాళ్ల సురేష్ బాబు, రవీంద్ర, వీరవసంతం, మధుసూదన్, యలమందనాయుడు, శ్రీరామమూర్తి, చల్లాపల్లి గోపాల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కొండెపిలో జరిగిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ కొండెపిలో లక్ష ఓట్ల మెజారిటీ రావాలని పిలుపునిచ్చారు. కందుకూరులో పోతుల రామారావు నామినేషన్ వున్నప్పటికి ఆయన వర్గీయులు స్వామి నామినేషన్ కి అధికసంఖ్యలో తరలివచ్చారు.