Home క్రైమ్ లాక్ డౌన్ ఉల్లంఘించిన షాప్ లపై కేసులు నమోదు : ఎస్ఐ ఎన్ సి ప్రసాద్

లాక్ డౌన్ ఉల్లంఘించిన షాప్ లపై కేసులు నమోదు : ఎస్ఐ ఎన్ సి ప్రసాద్

335
0

కొండపి : కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో అనుమతి లేకుండా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి తెరచి ఉంచిన సిమెంట్ షాప్, ఆటోమొబైల్ షాప్, టిఫిన్ షాప్ ల యజమానులైన కదిరి కోటేశ్వరరావు, కొత్త ప్రసాద్, మురపాకల వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్సి ప్రసాద్ తెలిపారు. అనవసరంగా రోడ్ మీదకి వచ్చిన ఆటోలు, ట్రాక్టర్లు, మోటారు బైక్ లపై 5 కేసులు నమోదు చేసి రూ.5,275 జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా Si ప్రసాద్ మాట్లాడుతూ లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనవసరంగా ఎవ్వరూ బయటకు రావద్దని, ఇండ్లలోనే ఉంది పోలీసులకు సహకరించి కరోన వ్యాప్తిని అరికట్టాలని కోరారు.