ప్రకాశం (దమ్ము) : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి నియమితులయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ స్వామి మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చంనాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పార్టీ బాధ్యతల నిర్వహణకై అంకిత భావంతో పనిచేస్తానని అన్నారు.