Home ప్రకాశం కోవిడ్ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే : ఎమ్యెల్యే స్వామి

కోవిడ్ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే : ఎమ్యెల్యే స్వామి

342
0

– కోవిడ్ పెంచడంలో, కోవిడ్ మరణాలు పెంచడంలో అభివృద్ధి సాధించారని ఆరోపణలు                                                               – వైసీపీ ప్రభుత్వంపై కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ధ్వజం                                            కొండేపి : వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఆమడ దూరంలో వుందని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంకు రు.52కోట్లతో 22గ్రామాలకు మంజూరైన రోడ్లు రెండేళ్లయినా ఒక్కటి కూడా వేయలేకపోయారన్నారు. నియోజకవర్గ కేంద్రమైన కొండపి అంబేద్కర్ నగర్ లో రు.50లక్షలతో నిర్మిస్తున్న అంబేడ్కర్ భవనం ఫిల్లర్లతో అలాగే ఆగిపోయిందని అన్నారు. ఎస్సీలకు కమ్యూనిటీ భవనం ఉండకూడదాని ప్రశ్నించారు. రెండేళ్లలో అభివృద్ధిలో ముందుకెళ్లినట్లా వెనుకకెళ్లినట్లాని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో ఒక్క ఇటుక ముక్క కూడా పెట్టలేదని, ఇదేనా అభివృద్ధని ప్రశ్నించారు.

సింగరాయకొండలో షాదీఖానా నిర్మాణానికి రు.30 లక్షలతో మంజూరు చేయించి టెండర్లు పూర్తయితే అతీగతీ లేదని అన్నారు. దీన్నిబట్టి ముస్లింలు అంటే ఎంత చులకన బావనుందో అర్ధమవుతుందన్నారు. పాకల బీచ్ ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రు.4.5కోట్లతో నిర్మాణం చేపడితే వైసిపి పాలనలో అర్థవంతంగా ఆగి పోయిందన్నారు. కొండేపి – పొదిలి రోడ్, కందుకూరు – కనిగిరి రోడ్లకు నిధులు మంజూరు చేయిస్తే ఆ రోడ్లు వేయడానికి వైసిపికి ఇంతవరకు చేతులు రాలేదన్నారు. సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు రెండేళ్లయినా ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదన్నారు. రావివారిపాలెం వెళ్లే రోడ్డులో పాలేరు మీద రు.13కోట్లతో నిర్మిస్తున్న వంతెనకు అదనపు నిధులు తేవడంలో వైఫల్యం చెందారని అన్నారు. సింగరాయకొండ గురుకుల పాఠశాలలో 100 సీట్లు సైన్స్ కోర్సులో రద్దు చేయడమే సంక్షేమంలో నాడు నేడు అని ప్రశ్నించారు. నాడు నేడు గొప్పలు చెప్పుకునే వైసిపి సింగరాయకొండ గురుకుల పాఠశాలలో పాత అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని కూల్చి మొండి గోడలు మిగిల్చారని అన్నారు. నాడు నేడు అంటే నాడు ఉన్నదాన్ని నేడు కూల్చి మొండిగోడలు చూయించడమేనా అభివృద్దంటే అని ప్రశ్నించారు.

అంబేడ్కర్ స్టడీ సర్కిల్ రద్దు చేయడం, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దు చేయడం, విదేశీ విద్యాధరణ పథకం రద్దు చేయడం, ప్రైవేట్ కాలేజీలలో పీజీ చదివే విద్యార్థులకు ట్యూషన్ ఫీజు రద్దు చేయడం సంక్షేమమాని ప్రశ్నించారు. మత్స్యకార భరోసా, రైతు భరోసాలలో లబ్ధిదారులను తగ్గించడమేనా సంక్షేమమంటే అన్నారు. కంది రైతులకు నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడమేనా సంక్షేమం అన్నారు. కరోనాతో ఉపాధిహామీలో సోషల్ ఆడిట్ ఎత్తేయడం వల్ల ఉపాధి హామీ పథకంలో ఇంట్లో కూర్చుని దొంగబిల్లులు తీసుకుని సగం అధికారులుకు, సగం నియోజకవర్గ స్థాయి నాయకుడు తీసుకుంటున్నారని ఆరోపించారు. లిక్కర్, ఇసుక, మట్టి మాఫియాలకు అంతే లేదని అన్నారు. అభివృద్ది గురించి మాట్లాడే హక్కు వైసిపి వారికెక్కడిదన్నారు.

కరోనా సెకండ్ వేవ్ వస్తుందిని శాస్త్రవేత్తలు, కేంద్రం ముందుగానే చెప్పినప్పటికీ ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని అన్నారు. కోవిడ్ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. కోవిడ్ వ్యాప్తి, కోవిడ్ మరణాలను పెంచడంలో అభివృద్ధి సాధించారని అన్నారు. ఒంగోలు అంబేడ్కర్ భవనానికి దామచర్ల జనార్దన్ నిధులతో పూర్తిచేస్తే మా ప్రభుత్వం నిధులు ఇచ్చిందని మంత్రులు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని డాక్టర్ స్వామి ధ్వజమెత్తారు. టిడిపి హయాంలో పేదలు ఇల్లు నిర్మించుకుంటే ఇంతవరకు వారికి బిల్లులు చెల్లించలేదని, అభివృద్ధి అంటే ఇదేనాని ఆయన ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో రోడ్లు వేస్తే ఇంతవరకు వారికి బిల్లులు చెల్లించలేదని స్వామి అన్నారు. కరోనా సెకండ్ వేవ్ వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోనందుకే అధిక మరణాలు సంభవిస్తున్నాయని ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఇదంతా ప్రభుత్వం చేతకానితనంగా స్వామి ఆరోపించారు.