Home ప్రకాశం భౌతిక దాడుల వెనుక ఉన్న వాళ్లెవరో పరిశీలిస్తాం – సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకర్...

భౌతిక దాడుల వెనుక ఉన్న వాళ్లెవరో పరిశీలిస్తాం – సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకర్ రావు

144
0

సింగరాయకొండ (దమ్ము) : మనం ఎదుర్కోవలసింది స్వామిని కాదు చంద్రబాబు నాయుడ్నని రాష్ట్ర సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకరరావు అన్నారు. వైసీపీ వైద్యావిభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి ఫై వైఎస్ఆర్ పార్టీకి చెందిన సింగరాయకొండ మూలగుంటపాడు వార్డు మెంబర్ దొడ్డా మహిధర్ రెడ్డి మంగళవారం ఒంగోలులోని ఒక కళ్యాణమండపంలో చేసిన దాడిని ఖండిస్తూ సింగరాయకొండలోని శివరామిరెడ్డి హాస్పిటల్ వద్ద గురువారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర పార్టీ తరపున అశోక్ రెడ్డిఫై జరిగిన దాడిని ఖండించడానికి ఇక్కడకు వచ్చానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇక్కడ శత్రువులు ఎవరు, ఇది మిత్ర వైరుధ్యమా శత్రు వైరధ్యమా అని ప్రశ్నించారు. స్వామి ఒక గడ్డి పూచ మనం ఎదుర్కోవాల్సింది ఎమ్మెల్యే స్వామిని కాదు, చంద్రబాబు నాయుడ్ని అని అన్నారు. అందుకు గ్రామాల్లో ప్రజా సమూహాలను కదిలించాలి అన్నారు. ఈప్రాంతంలో మొలకెతాల్సిన, మొలకెత్తినటువంటి అనేకమైన మొక్కలు ఇక్కడ తిరుగాడుతున్నాయని అన్నారు. దురదగుంటాకు లాగా అల్లుకుంటే గీరుకోవడానికి గోంగూర కూడా దొరకదని హెచ్చరించారు.

పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ అశోక్ రెడ్డి పై దాడిని కొందరు వెనుక ఉండి ప్రోత్సహించి, వేరే వాళ్ళతో చేయించారని, నిన్న డేవిడ్, అరుణమ్మ ఇప్పుడు అశోక్ రెడ్డి రేపు నువ్వు, నేను ఇంకెవరో, సమాజంలో ఇటువంటి దాడి సంఘటనలు మంచివి కావని అన్నారు. 2019లో వైసీపీ ఎందుకు ఓడిపోయిందో ప్రజలందరికీ తెలుసని అన్నారు. అందుకే మంచి పరిపాలన అందించే వారిని ఎన్నుకోండని అన్నారు.

వైసీపీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొడితే కొట్టేవాళ్ళమే కానీ మేము సౌమ్యులం. పేద ప్రజల కోసం పని చేసేవాళ్ళం. మాది కమ్యూనిస్టు పార్టీ కుటుంబం అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. శివరామిరెడ్డి కొడుకుగా పుట్టినందుకు మరింత గర్వపడుతున్నాను. ఎన్నిజన్మలైనా ఆయన కొడుకుగానే పుట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.

ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడానికి 2003లో రాజకీయాలలోకి వచ్చాను. 2003లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాగుంట శ్రీనివాసులురెడ్డి, పోతుల రామారావుల కోసం నిజాయితీగా పనిచేశాం. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జి.వి శేషు కోసం పనిచేశాం. 2014లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత వైవి.సుబ్బారెడ్డి, జూపూడి ప్రభాకరరావు కోసం పనిచేశాం. 2019లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాదాసి వెంకయ్య కోసం కష్టపడి పనిచేశాం. కొన్ని కారణాల వల్ల 2019లో ఓడిపోయాము. ఎందుకు ఓడిపోయామో ప్రజలకు, అధిష్టానానికి తెలుసు అన్నారు. ముఖ్యంగా కొండపి నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎప్పుడూ లేవు. ఈ హత్యా రాజకీయాలను ఎవరు ప్రోత్సహిస్తున్నారన్నారు. దీని వెనుక ఎవరు, పార్టీ వారి నిగ్గు తీసి హత్య రాజకీయాలు చేస్తున్న వారిని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. ఎన్నికల తర్వాత ఎవరైతే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తారో అటువంటివారిని గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కొండపి నియోజకవర్గంలోని జూపూడి, వెంకయ్య, అశోక్ రెడ్డి వర్గీయులు పాల్గొన్నారు.