Home బాపట్ల కొమ్మమూరు కాలువ పనులు పునరుద్ధరణ

కొమ్మమూరు కాలువ పనులు పునరుద్ధరణ

13
0

• ఎమ్మెల్యే ఏలూరి చొరవతో రూ.24 లక్షలు మంజూరు
• పెద్దగంజాం షట్టర్లు, లాకుల మరమ్మత్తులు
• దశాబ్దాల తర్వాత పునరుద్ధరణపై రైతుల హర్షం
చిన్నగంజాం (DN5 News): దశాబ్దాలుగా మరమ్మత్తులకు నోచుకోక నిర్లక్ష్యానికి గురైన కొమ్మమూరు కాలువ ఆయకట్టు చివరి లాకులైన పెదగంజాం లాకుల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో రూ.24 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో పనులు చేపట్టారు. పెదగంజాం గ్రామం కిలోమీటర్ 112.4 వద్ద ఉన్న లాకులకు నూతన షట్టర్లు, గేట్ల అమరికతో పాటు మరమ్మత్తు పనులు చేస్తున్నారు.

కాలువ ప్రవాహ నియంత్రణలో కీలకం
పెద్దగంజాం వద్ద ఉన్న ఈ లాకులు కొమ్మమూరు కాలువ వ్యవస్థలో అత్యంత కీలకమైనవని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. ఈ లాకుల తర్వాత కొమ్మమూరు కాలువ బకింగ్‌హామ్ కాలువగా మారుతుంది. అందువల్ల నీటి ప్రవాహం సక్రమంగా సాగేందుకు, వరదకాలంలో నీటి నియంత్రణకు షట్టర్లు, లాకులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

దశాబ్దాల నిర్లక్ష్యంతో ముగింపు
సుదీర్ఘకాలంగా మరమ్మత్తులు లేకపోవడంతో లాకుల గేట్లు, షట్టర్లు దెబ్బతిని నీటి నిర్వహణలో ఇబ్బందులు ఎదురయ్యేవని రైతులు చెబుతున్నారు. రైతుల సమస్యలు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ దృష్టికి ఎంఎల్‌ఎ తీసుకెళ్లడంతో నిధులు మంజూరు చేశారు.

రైతులకు ప్రయోజనం
లాకుల మరమ్మత్తు పనులు పూర్తయిన తర్వాత కాలువలో నీటి ప్రవాహం సక్రమంగా సాగడంతో పాటు వరద నియంత్రణ సాధ్యమవుతుందని, దీని వల్ల కొమ్మమూరు ఆయకట్టు పరిధిలోని రైతులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు. పనుల నిర్వహణ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.