గుంటూరు : టిడిపి జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకర్ల సమావేశంలో మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడారు. గతంలో చంద్రబాబునాయుడు నాయకత్వంలో టిడిపి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన పాలన అందించిదని చెప్పారు. నేడు టిడిపి కార్యకర్తలపై దాడులు చేయడం బాధాకరమన్నారు. తాను సభాపతిగా శాసన సభను పార్టీలకు అతీతంగా నడిపానని చెప్పారు. సమావేశంలో ఆలపాటి, జివి పాల్గొన్నారు.