కన్నూరు : కన్నూరులో నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌తో కలిసి కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ప్రభు ప్రారంభించారు. ఈ విమానాశ్రయంతో రాష్ట్రంలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు అయ్యాయి. ఒకే రాష్ట్రంలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలతో కేరళ దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచింది.
రెండు వేల ఎకరాల్లో రూ.1800 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. సంవత్సరానికి 1.5 మిలియన్ అంతర్జాతీయ ప్రయాణికులు ఈ విమానాశ్రయం సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈపాటికే తిరువనంతపురం, కోచి, కోజికోడ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.
విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని బిజెపి, కాంగ్రెస్ నేతలు బహష్కరించారు. శబరిమల వివాదంపై బిజెపి నిరసన తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌చాందీని ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు.