చీరాల : హైమా హాస్పటల్ ప్రాంగణంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కరుణానిధి రెండవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హాస్పిటల్ అధినేత డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ ద్రవిడ సూర్యుడు, ద్రవిడ ఉద్యమ నేత, రచయిత, సుదీర్ఘ రాజకీయ నేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ వ్యవస్థాపక సభ్యులు, తన 60ఏళ్ల రాజకీయ జీవితంలో (13 సార్లు) ప్రతి ఎన్నికల్లో గెలిచి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన నాయకుడని కొనియాడారు.
కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు మాట్లాడుతూ కరుణానిధి ఆత్మగౌరవ ఉద్యమాలలో తనదైన ముద్ర వేసి పెరియార్ రామస్వామి అనుచరుడుగా ఎదిగి తమిళనాడులోనే కాక జాతీయ రాజకీయలలో కూడా తనదైన ముద్ర వేసిన రాజకీయ దురందురుడన్నారు. కరుణానిధి సేవలను గుర్తు చేసుకున్నారు.
కొల్లిపర వెంకటేష్ మాట్లాడుతూ నాడు మండల్ ఉద్యమంలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల సాధన కోసం దేశవ్యాప్తంగా జరిగిన పోరాటంలో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తన జీవితాంతం కృషి చేసిన ప్రజా నాయకుడన్నారు. స్వయంప్రకటిత నాస్తికుడు, కళైనార్ అని ప్రజలు ప్రేమగా పిలుచుకునే నేత కళైనార్ అని గుర్తు చేశారు.