Home ప్రకాశం ఆదర్శ గ్రామంగా కారుమంచి

ఆదర్శ గ్రామంగా కారుమంచి

303
0

– మంత్రి బాలినేని హామీ
– మంత్రిని కలిసిన ‘మాఊరు అభివృద్ధి కమిటీ’
టంగుటూరు : మండలంలోని కారుమంచి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని విజయవాడలోని ఆయన స్వగృహంలో కలిసిన కారుమంచి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా కారుమంచి గ్రామంలో గత ఐదేళ్లుగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న అభివృద్ధి పనులను లక్ష్మణరెడ్డి మంత్రికి వివరించారు. గ్రామంలోని 24ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊరచెరువును సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు, పూలమొక్కలతో సుందరీకరణపై మంత్రి బాలినేని ప్రత్యేకంగా లక్ష్మణరెడ్డిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యున్నతమైన ఆదర్శవంత గ్రామంగా కారుమంచిని తీర్చిదిద్దడంలో మాఊరు అభివృద్ధి కమిటీ అహర్నిశలు కష్టపడుతోందని లక్ష్మణరెడ్డి వివరించారు. కారుమంచి అభివృద్ధిపై తనకు ఇదివరకే సమాచారముందని, కమిటీ కృషిని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభినందించారు. కరోనా విపత్కర పరిస్థితి అనంతరం కారుమంచి గ్రామంలో ‘గ్రామాల అభివృద్ధి- ప్రజల పాత్ర’పై రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహిస్తామని మంత్రి బాలినేనికి లక్ష్మణరెడ్డి వివరించినట్లు తెలిపారు.