చీరాల : కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇళ్ల కే పరిమితమైన నిరుపేదలకు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఆదేశాలతో వైసిపి యువనేత కరణం వెంకటేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం పేదల కడుపు నింపుతుంది. నిత్యావసర సరుకులు లేక, వంట చేసుకునేందుకు కూడా అవకాశం లేని పేదలకు ఫోన్ చేసిన అరగంటలో ఇంటి వద్దకే భోజనం చేర్చే ఏర్పాటును కరణం వెంకటేష్ చేశారు. వెంకటేష్ యూత్ సభ్యులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఆహారం కావాలని ఫోన్ చేసిన వెంటనే అందజేస్తున్నారు. ఆహారం అవసరం అయిన వాళ్ళు 9966874444 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. సోమవారం రోజు 855 మందికి ఇంటికి భోజనం చేర్చారు.