Home ప్రకాశం పేదల కడుపునింప్పుతున్న వెంకటేష్ యూత్

పేదల కడుపునింప్పుతున్న వెంకటేష్ యూత్

419
0

చీరాల, ఏప్రియల్, 06 : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలో కరోనా మహంమ్మరి ధాటికి విధించిన లాక్ డౌన్ కారణంగా దిక్కు తోచక అయోమయంలో ఉన్న పేద, బడుగు, వృద్ధులకు ప్రతీ నిత్యం ఆహారం, పండ్లు కరణం వెంకటేష్ యూత్ సభ్యులు పంపిణి చేసున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదలకు సోమవారం కట్టా జయ్, పేర్లి టీంకు సహకారంతో 200మందికి ఆహారం, పండ్లు అందించారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ఒకవైపు, యూత్ సభ్యులను ప్రోత్సాహిస్తూ అడుగులు వేస్తున్న ఆయన తనయుడు వెంకటేష్ మరోవైపు సేవా కార్యక్రమాలు చేపట్టారని యూత్ ప్రతినిధులు పేర్కొన్నారు. లాక్ డౌన్ ఉన్నత కాలం ప్రతీ నిత్యం ఆహారం, పండ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆకలితో బాధపడే వారు నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా సరే తమకు తెలిపితే సహాయం చేస్తామని తెలిపారు.