చీరాల : టిడిపి మాజీ సర్పంచి, ఆర్యవైశ్య నాయకులు వలివేటి రాజేశ్వర రావు సతీమణి మహాలక్ష్మమ్మ ఇటీవల మృతి చెందారు. ఆమె దశ దిన కర్మ ఆ సందర్భంగా టిడిపి యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు రాజేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటేష్ బాబు వెంట ఏఎంసీ మాజీ చైర్మన్ జనం శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, ఇతర టిడిపి నాయకులు ఉన్నారు.






