Home ప్రకాశం బాలినేని తనయుడిపై విమర్శలు తగదు : వైసీపీ నేతలు

బాలినేని తనయుడిపై విమర్శలు తగదు : వైసీపీ నేతలు

313
0

చీరాల : ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని కుమారుడుపై వచ్చిన ఆరోపణలను వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు కరణం వెంకటేష్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలేటి రామారావు ఖండించారు. చీరాల ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకోకుండా టిడిపి ఎల్లో మీడియా బాలినేని శ్రీనివాసరెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి ప్రచారాలు టిడిపి నాయకులకు మంచిది కాదని హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎటువంటి వారో జిల్లా ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. అటువంటి నాయకుడిపై, అతని తనయుడిపై దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని, బుద్ధి చెబుతామని అన్నారు.

కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ తమిళనాడులో దాడి జరిగినప్పుడు బాలినేని కుమారుడు ఉన్నాడని టిడిపి ఎల్లో మీడియా హల్చల్ చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఘటనకి బాలినేని కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఆ టైంలో అందరం విజయవాడలోనే ఉన్నామని అన్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం తానేనని కరణం వెంకటేష్ బాబు మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు యాదవ్, మించాలా సాంబశివరావు, చుండూరి వాసు, గోలి గంగాధరరావు, కంది అంజిరెడ్డి, మల్లెల బుల్లిబాబు, కట్టా రవిచంద్ర పాల్గొన్నారు.