చీరాల : పిట్టువారిపాలెం ప్రజలకు ఇబ్బందిగా మారిన రోడ్డును వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కరణం వెంకటేష్ బాబు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు పరిశీలించారు. గ్రామ ప్రజలకు అసౌకర్యంగా ఉన్న రోడ్డుకు సత్వరమే మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను గ్రామానికి పిలిపించి సూచించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి డిఈ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొనిగల జైసన్ బాబు, మించాలా సాంబశివరావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.