Home ప్రకాశం ప్రకాశం జిల్లా టిడిపికి భారీ షాక్ – టిడిపిని వీడనున్న కరణం బలరాం

ప్రకాశం జిల్లా టిడిపికి భారీ షాక్ – టిడిపిని వీడనున్న కరణం బలరాం

410
0

ఒంగోలు : చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి టీడీపీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్లు దాదాపు ఖరారైంద నీ ఆయన అనుచరులు చెప్పుకోవడం నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది. బలరాం పార్టీ మారడం చీరాల నియోజకవర్గం తో పాటు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. కరణం బలరామకృష్ణమూర్తి పార్టీ మారే అంశంపై ఇప్పటికే జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపినట్లు చర్చించుకుంటున్నారు.

ఒకటి రెండు రోజుల్లో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న నట్లు ప్రచారం జోరందుకుంది. బలరామకృష్ణమూర్తి తో పాటు ఆయన తనయుడు కరణం వెంకటేష్ కూడా వైసీపీ లోకి వెళ్తారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.