Home బాపట్ల ఇఫ్తార్ విందుకు హాజరైన ‘కరణం’

ఇఫ్తార్ విందుకు హాజరైన ‘కరణం’

10
0

చీరాల (DN5 News) : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కొత్తపేట ఐఎల్టీడీ కాలనీ మసీదు వద్ద గురువారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు వైసిపి యువజన ప్రెసిడెంట్ శీలం చంటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసిపి ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు హాజరై ముస్లిం సోదరులతో కలిసి విందులో పాల్గొన్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ వరికూటి అమృతపాణి, బీరక సురేంద్ర, షేక్ మహిముద్, షేక్ కబీర్ పాల్గొన్నారు.