చీరాల : వైసిపి యువనాయకులు కరణం వెంకటేష్ బాబు తలపెట్టిన ఆపన్న హస్తం కార్యక్రమం కరోనా బాధితులకు కడుపు నింపుతుంది. బాధితుల వద్దకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. భోజనం అవసరమైనవారి కోసం ఇచ్చిన హెల్ప్-లైన్ నెంబర్ 9966874444కు ఫోన్ చేసిన వెంటనే వారికి భోజనం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హైమ సుబ్బారావు, మించాలా సాంబశివరావు, జైసన్ బాబు, కటకం శ్రీనివాసరావు, జయరావు, దాసరి మణికంఠ, అశోక్ పాల్గొన్నారు.