Home ప్రకాశం ప్రజలు ఆరోగ్యంగా ఉన్నపుడే దేశం అభివృద్ధి : దేవరాజు

ప్రజలు ఆరోగ్యంగా ఉన్నపుడే దేశం అభివృద్ధి : దేవరాజు

458
0

చీరాల : ప్రజలు ఆరోగ్యంగా ఉన్నపుడే దేశం ఆర్థిక అభివృద్ధి సాధిస్తుందని కామాక్షి కేర్ ఎండీ తాడివలస దేవరాజ్ పేర్కొన్నారు. కామాక్షి కేర్ వైద్యశాల అధ్వర్యంలో ఆదివారం కారంచేడులో ఉచిత గ్యాస్, నరముల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం దేవరాజ్ మాట్లాడుతూ చాలా వరకు వ్యాధులు ప్రాథమిక దశలో నిర్లక్ష్యం చేయటం వలనే తీవ్రమవుతాయన్నారు. మొదట్లోనే వీటిని గుర్తించి చికిత్స అందిస్తే తక్కువ ఖర్చుతో సులువుగా నయమవు తాయన్నారు.

ప్రస్తుతం గ్యాస్ అనేది చిన్నా పెద్దా అనే తేడా లేకుండ అందరికి వస్తుందన్నారు. ఆహారం విషయంలో సమయ పాలన పాటించటం, మంచి ఆహారం తీసుకోవటం ద్వారా దీనిని నియంత్రిచ వచ్చన్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో నరముల జబ్బులు ఎక్కువగా ఉన్నాయన్నారు. అనంతరం రోగులను పరీక్షించిన వైద్యులు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యులు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ధన, రేవంత్, నాగరాజు పాల్గొన్నారు.