ప్రకాశం : కనిగిరి ప్రాంత ప్రజలకు ఫ్లోరిన్ సమస్య శాశ్విత పరిష్కారం వెలుగొండ ప్రాజెక్టుతోనే సాధ్యమనే అంశాన్ని జాతీయ స్థాయిలో గుర్తిస్తేనే త్వరగా ప్రాజెక్టు పూర్తవుతుందని వెలుగొండ సాధన సమితి ప్రతినిధులు వడ్డే శ్రీనివాసులు, కొల్లూరు రవికిరణ్ శర్మ పేర్కొన్నారు. అందుకే వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
వారణాసిలో తాము ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసేందుకు శుక్రవారం వెల్లినప్పటికి జనం రద్దీతో సకాలంలో వెళ్లలేకపోయినట్లు చెప్పారు. శనివారం తాము ప్రదానిపై స్వతంత్ర అభ్యర్ధులు గా నామినేషన్ దాఖలు చేస్తామన్నారు.
కనిగిరి ప్రజలకు తాగునీటి సమస్యపై ఈ పాటికె ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ నేత జగన్, జనసేన నేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.