కందుకూరు : లాక్ డౌన్ సమయంలో నిబంధనలను అతిక్రమించి హైదరాబాదు నుండి కరేడు వచ్చిన నలుగురు వ్యక్తులను గత 14 రోజులుగా కందుకూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉంచారు. శుక్రవారంతో గడువు ముగిసింది. వారిలో ఎవరికీ కరోనా అనుమానిత లక్షణాలు కనిపించలేదు. నిబంధనల మేరకు రాత్రి 7.30 సమయంలో వారి స్వస్థలాలకు పంపించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ మహబూబ్ భాషా, తహశీల్దారు బిట్రా శ్రీనివాసరావు, క్వారంటైన్ నిర్వహణాధికారి, డిఇఇ రమేష్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వారంటైన్ లో గడిపిన వారికి ఒక్కొక్కరికి ప్రభుత్వం ప్రకటించిన రూ.2వేల భత్యాన్ని శాసనసభ్యులు మహీధర్ రెడ్డి అందజేశారు.