Home ప్రకాశం రూ.22కోట్లతో కంభం చెరువును అభివృద్ధికి ప్రతిపాదనలు

రూ.22కోట్లతో కంభం చెరువును అభివృద్ధికి ప్రతిపాదనలు

258
0

కంభం : చెరువు అభివృద్ధి చేయడానికి రూ.22కోట్లతో ప్రభత్వాని ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. శుక్రవారం గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని కంభం మండలంలోని చింతలపాలెం వద్ద కంభం చెరువును, కాలువలను గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో కలసి పరిశీలించారు. అనంతరం విజిపి గెస్ట్ హౌస్ లో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ అధికారులతో కంభం చెరువు, కాలువల అభివృద్ధి పనులు చేపట్టడానికి తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో కంభం చెరువుకు ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. కంభం చెరువు సుమారు 11 సంవత్సరాల తరువాత (2020) ఇప్పుడు పూర్తి స్థాయిలో నిండిదన్నారు. కంభం చెరువు నీటితో రెండు సంవత్సరాలు భూములు సాగుచేసుకో వచ్చునన్నారు. రాబోయే రోజుల్లో కంభం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. కంభం చెరువు నీటిని సాగునీటి అవసరాల కోసం ఈ సీజన్ లో నీటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కంభం చెరువు క్రింద ఉన్న పెద్ద కంభం, చిన్న కంభం, నక్కలగండి కాలువలను అభివృద్ధి చేయడానికి రూ.కోటితో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కంభం చెరువు ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కాలువ పనులు ముమ్మరంగా చేపట్టడానికి అవసరమైన నిధులను డ్వామా, పంచాయతీ శాఖల ద్వారా అనుసంధానం చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. త్వరలో కంభం చెరువు కాలువ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ కంభం చెరువు ఆయకట్టు రైతులు ఈ సీజన్లో సాగునీటిని అందించడాని చర్యలు తీసుకున్నామన్నారు. కంభం చెరువు అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న జిల్లా కలెక్టర్ ను అభినందించారు. సమావేశంలో వెలిగొండ ప్రాజెక్ట్ ఎస్ఇ నగేష్, ఇరిగేషన్ ఇఇ తిరుపతిరెడ్డి, డ్వామా పిడి శీనారెడ్డి, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, తహసీల్దార్ రామ్ మోహన్, ఎంపీడీఓ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.