చీరాల : తెల్లకార్డు ఉన్న వారికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా హెర్నియా శస్ర్త చికిత్స చేస్తున్నట్లు శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు తెలిపారు. బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన వారు హెర్నియా సమస్యతో బాధపడుతూ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్‌కు రాగా అన్ని పరీక్షలు చేసి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో వారు ఇంటికి వెళ్లారని తెలిపారు.