కాకినాడ : జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ క్వారెంటైన్ సెంటర్లను వెంటనే తొలగించాలని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ సత్యనారాయణ సెప్టెంబర్ 2న లేఖ రాశారు. సెప్టెంబర్ 30లోపు ఇంజనీరింగ్, బీఫార్మసీ, పీజీ విద్యార్థుల సంవత్సరాంత పరీక్షలు పూర్తిచేయాలని యుజిసి ఆదేశించినందువల్ల పరీక్షల తేదీలను ప్రకటించారు. యూజీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 13నుండి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈలోపే క్వారంటైన్ సెంటర్లను ఖాళీ చేయాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఈ నెల 2న జెఎన్టియు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సత్యనారాయణ లేఖలో కోరారు. వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రకాశం జిల్లాలోని రైస్ గాంధీ ఇంజనీరింగ్ కళాశాల, క్విస్ ఇంజనీరింగ్ కళాశాల, కృష్ణ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల, చీరాల ఇంజనీరింగ్ కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా రోగులకు చికిత్స, క్వారెంటైన్ సెంటర్ను తక్షణమే తొలగించాలని కోరారు.