చీరాల : మహాత్మ జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర గడియార స్థంభం సెంటర్లో ఉన్న పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సురేంద్ర మాట్లాడుతూ అధిపత్యవర్గాలకు వ్యతిరేకంగా బడుగుబలహీన వర్గాలకు, స్థానికులకు సమాన అవకాశాలు కల్పించాలని పోరాటం చేసిన మహానుభావుడు పూలే అని పేర్కొన్నారు. ఆయన ఉద్యమ ఫలితమే సాహు మహరాజ్ ఆస్థానంలో 50శాతం బ్రహ్మణేతరులకు ఉద్యోగ అవకాశం కల్పించారన్నారు.
మహిళ విధ్యాసాధికారతకు విశేష కృషిచేసిన మహాత్మ జ్యోతిరావు పూలేని స్మరించుకుంటు ఆయన ఆశయ సాధనకు కృషిచేయవలసిన అవసరం మనందరిపైన ఉందన్నారు. ఆయన ఆశయసాధనలో భాగంగా నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పనుల్లో 50శాతం బీసీలకు కేటాయిస్తూ, మహిళలకు అధికప్రాధాన్యత ఇస్తూ అన్నింట్లో 50శాతంకు తక్కువ కాకుండా పూలే ఆశయాలను కొనసాగిస్తున్న అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సీఎం జగన్ కు బీసీలందరి తరుపున కృతజ్ఞతలు తెలిపారు. బీసీలంటే వెనకబడిన తరగతులు కాదు వెన్నుముక తరగతులగా చేస్తామని చెప్పి 56కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సామాజిక, ఆర్ధిక, రాజకీయ అభివృద్ధికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వెన్నంటి ఉంటామని తెలిపారు.
కార్యక్రమంలో వైస్సార్ సిపి చీరాల చేనేత విభాగం అధ్యక్షులు గంజి సతీష్, బిసి సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా కార్యదర్శి అమిత్, బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు గుంటి శ్రీనివాసరావు, పవన్, పూర్ణ, కార్యకర్తల పాల్గొన్నారు.