చీరాల : జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో వైద్యశాఖ బలోపేతం కోరుతూ కోవిడ్-19 నేపథ్యంలో వైద్యులను, నర్సులను, పారా మెడికల్ సిబ్బంది నియామకాలను చేపట్టాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. వైద్య సిబ్బందికి పిపిఈ కిట్లు అందించాలని, కోవిడ్ చికిత్స నిమిత్తం బెడ్ లను పెంచాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా కోవిడ్ కు పూర్తి ఉచితంగా వైద్యం అందించాలని కోరారు. కోవిడ్ ఆసుపత్రులలో పౌష్టికాహారం, ఇతర సౌకర్యాలను కల్పించాలని, హోమ్ ఐసోలేషన్ ద్వారా వైద్యం కోరుకున్న వారికి ఉచితంగా మెడికల్ కిట్లను అందించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి వైద్యరంగాన్ని పూర్తిగా ప్రభుత్వపరం చేయాల్సిన అవసరాన్ని గమనించి తగు చర్యలు చేపట్టాలని జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రా రామారావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనవిజ్ఞానవేదిక డివిజన్ కార్యదర్శి బి పిచ్చయ్య, కె వీరాంజనేయులు, ఎల్ జయరాజు, కుర్రా శ్రీనివాసరావు, షేక్ జానిబాషా తదితరులు పాల్గొన్నారు.