చీరాల : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, నైపుణ్యాలను చెకుముకి పరీక్ష వెలికితీస్తుందని కొత్తపేట హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని ఎస్ ఇందిరా ఇజ్రాయేలు అన్నారు. సర్వశిక్షా అభియాన్ సహకారంతో జన విజ్ఞాన వేదిక చెకుముక ప్రతిభా పోటీలు శనివారం ఉదయం నిర్వహించారు. పాఠశాల స్థాయిలో 95 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. విద్యార్థులకు విజ్ఞానశాస్త్రంపై మీద ఆసక్తి పెరగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని ఆమె విడుదల చేశారు. పాఠశాల స్థాయిలో నేడు జరిగిందన్నారు. 7వ తేదీ మండల స్థాయిలో, డిసెంబర్ 15, 16 తేదీల్లో జిల్లాస్థాయిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పరీక్షతో పాటు ముగింపు సంబరాలు పెద్దాపురం వేదికగా జనవరి 9, 10, 11 తేదీల్లో జరుగుతాయన్నారు. చీరాల నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఈ పరీక్షలో సుమారు 3వేల మంది పాల్గొన్నారని జేవివి డివిజన్ కార్యదర్శి బిరుదు పిచ్చయ్య వెల్లడించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రా రామారావు, గవిని నాగేశ్వరరావు, సత్యనారాయణ, ఎస్జీడి ఖురేషీ, పవని భానుచంద్రమూర్తి, బండి భిక్షాలు బాబు, జయరావు, కుర్రా శ్రీనివాసరావు, ఆదిశంకర్, డి నారపరెడ్డి పాల్గొన్నారు.