శింగరాయకొండ : అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి రోజున “సేవ్ జర్నలిజం డే” గా IJU దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మన రాష్ట్రంలో APUWJ పిలుపు మేరకు కొండేపి నియోజక వర్గంలోని సింగరాయకొండలో APUWJ ఆద్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నుండి గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహంకు పూలదండ వేసి జర్నలిస్టుల సమస్యలఫై గాంధీ విగ్రహంకు ఆర్జీ ఇచ్చారు. విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేశారు. ప్రధానంగా జర్నలిస్టులకు ప్రమాద బీమా, ఇళ్ళ స్థలాలు, హెల్త్ కార్డులు, మిగిలి పోయిన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులఫై దాడులను ఖండిస్తూ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో APUWJ కొండేపి అధ్యక్షుడు పల్నాటి బాలకృష్ణ, గౌరవ అధ్యక్షుడు కసుకుర్తి రామలింగం, ఉపాధ్యక్షుడు నరసింహ, ట్రజరర్ షేక్ బాషు, సభ్యులు కోటి, చంగలరావు, దాసు, మహేష్, సుబ్రమణ్యం, సుధ, శివ, డి వెంకట్రావు పాల్గొన్నారు.