కొండపి : జర్నలిస్టుల రాష్ట్రవ్యాప్త దినోత్సవంలో భాగంగా జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు కొండపి తహసిల్దార్ జి సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజె కొండేపి నియోజకవర్గ కమిటీ నాయకులు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న సంఘటనలను ప్రతిక్షణం ప్రభుత్వానికి, ప్రజలకు అందిస్తున్న జర్నలిస్టులను నిర్లక్ష్యం చేయడం దారుణం అన్నారు. కరోనా మహమ్మారితో ప్రజలంతా బీతిల్లి ఉన్నప్పటికీ జర్నలిస్టులు మాత్రం రెడ్ జోన్ లలోకి కూడా సైనికుల్లా వెళ్లి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా బారిన పడి ముగ్గురు జర్నలిస్టులు మృతి చెందారని, చాలా మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నా రన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు యాబై లక్షలు అందజేయాలని కోరారు. చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ప్రత్యేక చికిత్స అందించాలని కోరారు. జర్నలిస్టులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించే మాస్క్ లు అందజేయాలని కోరారు. అనంతరం కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కొండపి నియోజకవర్గ అధ్యక్షులు జివి కుమార్, ప్రధానకార్యదర్శి లింగయ్యనాయుడు, వైఎస్ ప్రెసిడెంట్ శివకుమార్, మాజీ అధ్యక్షులు నరసయ్య, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.