చీరాల : మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలో నూటికి ఐదుశాతం మందికి శస్త్ర చికిత్సలు అవసరమవుతాయని ఆర్థోపెడిక్ డాక్టర్ కంచర్ల రాంప్రసాద్ చెప్పారు. చీరాల డాక్టర్ ఆళ్ల సైదులు చౌదరి హాస్పిటల్‌లోని ఎ1 హాస్పిటల్ క్లినిక్‌లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో రాంప్రసాద్ మాట్లాడారు. ఫాస్ట్‌ట్రాక్ పద్దతిలో తక్కువ మత్తుతో ఎక్కువ ఉపశమనం ఉంటుందని చెప్పారు. ఈ పద్దతిలో ఆపరేషన్ చేసిన మొదటి రోజే నడిపించేందుకు వీలుంటుందన్నారు. ఆపరేషన్ చేసిన ఐదు రోజుల్లో ఇంటికి వెళ్లవచ్చని చెప్పారు. చీరాలకు చెందిన జె వరలక్ష్మి అనే మహిళకు ఫాస్ట్‌ట్రాక్ పద్దతిలో రెండు మోకాళ్లకు ఆపరేషన్లు విజయవంతంగా చేసినట్లు చెప్పారు. ప్రతి బుధవారం చీరాల ఆళ్ల సైదులు చౌదరి హాస్పిటల్‌లో వైద్యసేవలందిస్తామని తెలిపారు.