– వివిధ కంపెనీలలో 1480కిపైగా ఖాళీలు
– రూ.10వేల నుండి రూ. 20వేలు వేతనం
– కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రకటన
బాపట్ల (DN5 News) : చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ (DR.VinodKumar)బుధవారం తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహకారంతో నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారిణి ఎం మాధవి ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ డిగ్రీ కళాశాల వేదికగా 22 బహుళజాతి కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ జాబ్ మేళాకు ఫ్లెక్స్ టెక్ సొల్యూషన్, ఇన్నోవా సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, మాస్టర్ మైండ్స్, కెప్టెన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, బెటర్ క్యాష్ సొల్యూషన్, ఎన్ఎక్స్ఎల్ టెక్స్‌టైల్స్, జోయా అలుకాస్, ఎయిర్టెల్ గోదావరి ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హీరో మోటర్ కాప్, హైడ్రోడ్రాక్స్, జెయింట్ క్లౌడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు హాజరవుతున్నాయని తెలిపారు. అన్ని కంపెనీల్లో కలిపి 1480కి పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. విద్యార్హతను బట్టి రూ.10వేల నుండి రూ.20వేల వరకు ఉంటుందని తెలిపారు.
ఈ జాబ్ మేళాకు ఎస్ఎస్‌సి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా, బిటెక్, ఎంబిఎ, పిజి విభాగంలో చదువుకున్న 18నుండి 30ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు బయోడేటా లేదా రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్ పోర్ట్ ఫోటోతో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. వివరాలకు 93462 80289, 91005 66581, 96420695229, 9032384347 అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/ వెబ్ పోర్టల్ నందు రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరములకు టోల్ ఫ్రీ నంబర్ 9988853335, పైన తెలిపిన నంబర్లను సంప్రదించాలని కోరారు.






