Home బాపట్ల డిప్యూటి సిఎంపై అసభ్య ఫోటోలు అప్‌లోడ్‌ చేసినవారిపై పిర్యాదు

డిప్యూటి సిఎంపై అసభ్య ఫోటోలు అప్‌లోడ్‌ చేసినవారిపై పిర్యాదు

46
0

చీరాల : జనసేన అధినేత, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అవాంచిత పోస్టులు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరామ ప్రసాద్ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో శనివారం పిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ట్విట్టర్లో అసభ్యంగా పోస్ట్ చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం హనాననం చేసే విధంగా బాడి షేమింగ్‌కు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాలవలస శ్రీనివాస్, ప్రోగ్రాం కమిటీ జిల్లా కార్యదర్శి మామిడాల శ్రీనివాసరావు, హనుమకొండ కిషోర్, గోకుల్ కిరణ్, కనపర్తి రామారావు, లక్కాకుల లక్ష్మి, టి కోటేశ్వరి, ఎం వీరమ్మ, భాగ్యలక్ష్మి, నాగలక్ష్మి పాల్గొన్నారు.