పండగ పూటకుడా ఏంది ఈ హౌస్ అరెస్టులు అని పోలీస్ లతో వాగ్వాదం కు దిగిన తరుణం లో.. దండం పెట్టీ, దయచేసి అర్థం చేసుకోండి సార్, పండగ పూట వాళ్ళు చెప్పింది చెయ్యక పోతే మా ఉద్యోగం పోతుంది అని చెబుతున్న పోలీసులు చూసి నిజంగా జాలేస్తుంది
– @KiranRoyaljsp @PawanKalyan @JanaSenaParty… pic.twitter.com/hNYwqv28SN— Kiran royal (@KiranRoyaljsp) September 18, 2023
ఏపీలో పోలీసులు తీరు రోజు రోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు రోజు నుండి తాజాగా నిరసనల కార్యక్రమాల వరకు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమ అధినేత అరెస్టుకు నిరసన చేపట్టే అవకాశం పోలీసులు ఇవ్వడంలేదు. టిడిపి నేతలు రోడ్డుపైకి వస్తే అరెస్టు చేస్తున్నారు. పోలీసు స్టేషన్లలో, ఇళ్లలోనో నిర్భందిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం సంబరాలు చేసుకోవడానికి ఎక్కడా పోలీసు అభ్యంతరాలు లేవు. దీంతో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున ఆరోపణల దుమారం రేగుతుంది. తాజాగా ఏపీలో పోలీసులు ప్రతిపక్ష కార్యకర్తలపై ఉక్కుపాదం ఎందుకు మోపుతున్నారో తెలుపుతూ జనసేన కీలక నేత కిరణ్ రాయల్ ఓ వీడియో ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులను చూస్తుంటే జాలేస్తోందని ఆ పోస్టుకు ట్యాగ్‌లైన్ ఇచ్చారు.
పోలీసులు ప్రతిపక్షాలకు చెందిన నేతలను గృహనిర్భంధం చేయడం ఇటీవల ఎక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసే వీలు లేకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ‘పండగ పూట కుడా ఏంది ఈ హౌస్ అరెస్టులు అని పోలీసులతో వాగ్వాదానికి దిగిన తరుణంలో.. దండం పెట్టి దయచేసి అర్థం చేసుకోండి సార్.. పండగ పూట వాళ్ళు చెప్పింది చెయ్యకపోతే మా ఉద్యోగం పోతుంది’ అంటూ ఓ పోలీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోను జనసేన నేత కిరణ్ రాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఏపీలో పోలీసులు వైసీపీ నేతలు ఏం చెప్తే అదే చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. జగన్ సర్కారు చేపట్టిన అణచివేత చర్యలపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.