Home ప్రకాశం వాడరేవులో గడప గడపకు జనసేన తరంగం

వాడరేవులో గడప గడపకు జనసేన తరంగం

396
0

చీరాల : జనసేన అధినేత‌ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జ‌న‌తరంగం కార్యక్రమం 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, తోట రాజశేఖర్ మాట్లాడుతూ మత్స్యకారులకు జ‌న‌సేన సిద్దాంతాల‌ను వివ‌రించారు. మ‌త్య్స‌కారుల సంక్షేమానికి జ‌న‌సేన ప‌నిచేస్తుంద‌న్నారు. మత్యకారుల బోట్లులకు సబ్సిడీపై డీజిల్, మత్స్యకార ఉత్పత్తుల పరిరక్షణకు కోల్డ్ స్టోరేజ్ లో ఏర్పాటు చేస్తామ‌న్నారు. రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో రూ.2500 నుంచి రూ.3500 వరకు నగదు జమ చేస్తామ‌న్నారు. గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు ఇస్తామ‌న్నారు. బీసీలకు ఆవ‌కాశాన్ని బట్టి ఐదు శాతం రిజర్వేషన్లు పెంపుదల, బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు తదితర అంశాలను ప్రజలకు వివరించారు. గ్రామ‌ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను నాయ‌కుల దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో జనసేన వాడరేవు నాయకులు తాటికొండ విజయ్, బలగం వెంకటేష్, చిన్నారావు, శామ్యూల్, బుల్లెబ్బాయి, సింహాద్రి, జగ్గరావు, పులి పాల్గొన్నారు.