Home ప్రకాశం చీరాలలో జగనన్న విద్యా వసతి దీవెన ప్రారంభం

చీరాలలో జగనన్న విద్యా వసతి దీవెన ప్రారంభం

273
0

చీరాల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలులో భాగంగా జగనన్న విద్య వసతి దీవెన కార్యక్రమాన్ని పురపాలక సంఘం కమిషనర్ రామచంద్రారెడ్డి స్థానిక కౌన్సిల్ హాల్ నందు ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు చదవడానికి ఆర్ధిక ఇబ్బందులు కలగకూడదనే సదాశయంతో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష మేరకు విద్యార్థులందరూ ఈ వసతి దీవెన ను సద్వినియోగం చేసుకొని చక్కగా విద్యను అభ్యసించాలని, తమ జీవితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వసతి దీవెన కార్డులను విద్యార్థులకు పంపిణీ చేశారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల విద్యార్థులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సూపర్వైజర్లు పి సురేష్, షేక్ జానీబాషా, సి2 గుమస్తా సుజన, ఎడ్యుకేషన్ సెక్రటరీలు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.